హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఎక్కువైంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆ నియోజకవర్గానికి చెందిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇండ్లను తన అనుచరులకే ఇస్తున్నాడని, అర్హులను ఎంపిక చేసే విషయంలో కూడా కడియం శ్రీహరి అనుచరులు అవకతవకలకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్టీ మారి తన వెంట కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికే కడియం శ్రీహరి ప్రాధాన్యం ఇస్తున్నాడని ఫిర్యాదులో వెల్లడించారు. వారికే వివిధ కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తున్నాడని, ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.