హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం సభాహకుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. విద్యు త్తు మీటర్ల విషయంలో సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడినందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై సభా హకు ల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభాపక్షం కోరింది. శుక్రవారం శాసనసభలో స్పీకర్‌ను కలిసి వినతి ప త్రం సమర్పించింది. ఈనెల 27న శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా విద్యుత్తు మీటర్ల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించినందుకు సభహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్టు తెలిపింది.
విద్యుత్తు మీటర్ల విషయంలో 2017లో జరిగిన ఒక ఒప్పం ద పత్రాన్ని తీసుకొచ్చి, అందులోని కొన్ని పదాలు మాత్రమే చదివి, మరికొన్ని పదాలు ఉద్దేశపూర్వకంగా వదిలేశారని తెలిపారు. దీంతోపాటు బీఆర్ ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం అభ్యంతరకర వ్యాఖ్యలపైనా శాసనసభ నియమావళి 168 (1) ప్రకారం సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తున్నామని తెలిపారు. స్పీకర్‌ను కలిసిన ఫిర్యాదు చేసినవారిలో బీఆర్ఎస్ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేము ల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్, విజయుడు, అనిల్ జాదవ్ ఉన్నారు.