మహబూబ్‌నగర్ కలెక్టరేట్/ గద్వాల, మే 19 : జాతీయ రక్షణ నిధికి పలువులు విరాళాలు ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్లో వడ్డేపల్లి మండలం కోయిలదిన్నెకి చెందిన గోరంట్ల లక్ష్మీకాంత్‌రెడ్డి (రిటైర్డ్ హెచ్ఎం) జాతీయ రక్షణ నిధికి విరాళంగా రూ.లక్ష చెక్కును కలెక్టర్ సంతోష్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్మీకాంత్‌రెడ్డి రైతు భరోసా పథకం ద్వారా తన బ్యాంక్ ఖాతాలో జమైన రూ.లక్షను దేశ రక్షణ కోసం విరాళంగా అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ కరస్పాండెంట్ జలజం అరుంధతీరాయ్ రూ.లక్ష విరాళం ప్రకటించారు. జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయంలో కలెక్టర్ విజయేందిరబోయికి పాఠశాల సిబ్బంది రూ.లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల సిబ్బందిని అభినందించారు.