Minister KTR | తెలంగాణలో పెట్టుబడులను రెట్టింపు చేసిన కోకాకోలా.. మంత్రి కేటీఆర్ హర్షం
Minister KTR | కోకా కోలా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. సిద్దిపేటలోని ప్లాంట్‌ను మరింత విస్తరించాలని కోకా కోలా సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో కొకాకోలా సంస్థ తన ప్రణాళికను తెలియజేసింది.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పలు కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండగా, ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన పలు కంపెనీలు.. తమ ప్లాంట్లను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. కోకా కోలా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. సిద్దిపేటలోని ప్లాంట్‌ను మరింత విస్తరించాలని కోకా కోలా సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో కొకాకోలా సంస్థ తన ప్రణాళికను తెలియజేసింది. తమ సంస్థకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్ భారత్ అని.. ఇక్కడ తమ వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించే వ్యూహంలో ముందుకు పోతున్నామని కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి తెలిపారు. అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ఆయన మంత్రి కేటీఆర్‌కి తెలియజేశారు. సిద్దిపేటలోని ప్లాంట్‌ను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. కరీంనగర్ లేదా వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలియజేసింది. ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్ పెట్టుబడితో కలుపుకుంటే తెలంగాణలో కోకాకోలా సంస్థ దాదాపుగా 2500 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టినట్లు అవుతుందని కోకాకోలా సంస్థ మంత్రి కేటీఆర్‌కు తెలిపింది.
Cola Cola doubles down on its investment plans in Telangana!
✳️ Bolstered by the support from the Telangana government, Hindustan Coca Cola Beverages Pvt Ltd (HCCB) has committed an additional investment of Rs. 647 Cr in the greenfield plant which is under construction at Banda… pic.twitter.com/RqIKIxXO6j
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 26, 2023
అన్ని రంగాల్లో రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ : కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకవైపు ఐటీ, ఐటీ అనుబంధ రంగాలతో పాటు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాలే కాకుండా, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ డిఫెన్స్ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని అన్నారు. తాజాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ కోకాకోలా తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండో తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు మేక్ గ్రీవికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

