న్యూఢిల్లీ, మే 3: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించిన 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మే 20 తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
ఫలితాల తేదీలపై వదంతులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, దీనిపై స్పష్టత ఇచ్చేందుకే ఈ ప్రకటన చేసినట్టు చెప్పారు. కాగా, ఈ రెండు తరగతుల పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య జరిగిన విషయం తెలిసిందే.