న్యూఢిల్లీ, మే 3: ఉల్లిగడ్డల ఎగుమతిపై 40 శాతం పన్ను విధిస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అలాగే దేశీయ శనగలపై 2025 మార్చి 31 వరకు దిగుమతి పన్నును మినహాయిస్తున్నట్టు పేర్కొంది. పచ్చ బఠాణీలపై అమలవుతున్న పన్ను మినహాయింపు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్లో తెలిపింది.
ఇవి ఈ నెల 4 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం కొనసాగించింది. అయితే బంగ్లా, యూఏఈ లాంటి కొన్ని మిత్రదేశాలకు మాత్రం పరిమిత పరిమాణంలో సరుకును ఎగుమతి చేస్తున్నది.