వరంగల్, సిద్దిపేట అర్బన్, కుంటాల/భైంసా మే 3 : లోక్సభ ఎన్నికల్లో పలువురు శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకొన్నారు. హోం ఓటింగ్లో భాగంగా శుక్రవారం వరంగల్లోని దేశాయిపేట రోడ్ బృందావన్కాలనీకి చెందిన 108 ఏండ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు, పోలీసుల సమక్షంలో ఓటు వేసింది. వరంగల్ లోక్సభ పరిధిలో ఇదే తొలి ఓటు.
సిద్దిపేటలో వృద్ధులు, దివ్యాగుల వద్దకు అధికారులు వెళ్లి వారి చేత ఓటు వేయించారు. నిర్మల్ జిల్లాలో పలువురు శతాధిక వృద్ధులు శుక్రవారం ఓటు వేశారు. కుంటాలకు చెందిన బొంతల లసుంబాయి (105), భైంసాకు చెందిన అన్నపూర్ణ బాయి (104)ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకొన్నారు.