జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం సింగరేణి/గోదావరిఖని: సింగరేణి సంస్థ ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోకపోగా, గత పదేండ్లలోనే కనిష్ఠ ఉత్పత్తిని నమోదుచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక కరోనా ఏడాది (2020-21)ని మినహాయిస్తే, మిగ తా సంవత్సరాల్లో ఏటేటా బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ రాగా, ఈసారి మాత్రం గణనీయంగా పడిపోయింది. సింగరేణి సంస్థ ప్రస్తుతం ము గిసిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చి నెలాఖరు నాటికి బొగ్గు ఉత్పత్తి 58 మిలియన్ టన్నులకే పరిమితమైంది. ఇది నిర్దేశిత లక్ష్యం 72 మిలియన్ టన్నుల కంటే దాదాపు 14 మిలియన్ టన్నులు తక్కువ. ఇందుకు ప్రభు త్వ మితిమీరిన రాజకీయ జోక్యమే కారణమని కార్మికులు చర్చించుకుంటున్నారు.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రభుత్వ, నాయకుల జోక్యం పెద్దగా ఉండేది కాదని, దీంతో అధికారులు ఉత్సాహంగా పనిచేసేవారని కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని, దీంతో అధికారులు ఎవరూ మనసు పెట్టి పనిచేయడం లేదని చెప్తున్నారు. గతంలో ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి వరకు ప్రొడక్షన్ పీరియడ్‌లో భాగంగా కార్మికులందరూ 100% విధులకు హాజరై ఉత్పత్తిలో భాగస్వాములైన వారికి ప్రోత్సాహక బహుమతులు ఉండేవి. కానీ, ఈ ఏడాది కొత్త పోకడలు రావడం, ప్రొడక్షన్ పీరియడ్‌కు సంబంధించి ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఛేదించకపోవడంతో సంస్థ భవిష్యత్‌పై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగ్ విచారణ చేయాలి
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా అంకెల గారడీకి సంబంధించి కాగ్ పూర్తిస్థాయి విచారణ జరుపాలి. సం స్థలో ప్రస్తుతం 2026 ఏప్రిల్ 1 నాటికి బొగ్గు నిల్వలు ఎన్ని ఉన్నాయనేది తేల్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో తీవ్ర వ్యత్యాసం అనేక అనుమానాలు కలిగిస్తుంది. అసలు సింగరేణిలో ఏం జరుగుతుందనేది కార్మికులకు తెలియజేయాలి. సింగరేణి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహారాలు పూర్తిగా ఆక్షేపణీయం.
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
గత దశాబ్దపు ఉత్పత్తి గణాంకాలు (మిలియన్ టన్నుల్లో…)
ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి
