హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ పనుల్లో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నైనీ బొగ్గు బ్లాకుపై ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ బలరామ్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
4 నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించాలని సూచించారు. నిర్వాసితుల కు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, సీఎస్సార్ పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. సింగరేణికి ఒడిశా అటవీశాఖ బదలాయించిన 783.27 హెక్టార్ల స్థలం అప్పగింతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.
సింగరేణి సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాక్‌పై ప్రత్యేక శ్రద్ధచూపి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం భట్టికి ధన్యవాదాలు తెలిపారు. అక్టోబ ర్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామని చెప్పారు.