హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారని వాళ్లకు కనీసం జ్ఞానం ఉండటం లేదని సీఎం రేవంత్‌రెడ్డి పే ర్కొనటాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఖండించారు. కొంతమంది విద్యార్థులు వారి వ్యక్తిగత బలహీనతలు, పరిస్థితుల ప్ర భావం, చెడు సావాసాల వల్ల తప్పుదారి పడితే మొత్తం విద్యార్థులనే నిందించటం సీఎం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని స్వయంగా సీఎమ్మే అంగీకరిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
శరన్నవరాత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలంపూర్‌లోని శ్రీ జో గులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో అక్టోబర్ 3 నుంచి 12వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఆలయ కార్య నిర్వహణాధికారి పురేందర్‌కుమార్, ప్రధాన అర్చకులు ఆనంద్‌శర్మ బుధవారం మంత్రి సురేఖను హైదరాబాద్‌లోని ఆమె నివాసం లో కలిసి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వానపత్రికను అందించారు.