ప్రతి గ్రామానికి టీ-ఫైబర్ ఇంటర్నెట్
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అమెండెడ్ భారత్‌నెట్ ప్రొగ్రామ్(ఏబీపీ) కింద టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అమెండెడ్ భారత్‌నెట్ ప్రొగ్రామ్(ఏబీపీ) కింద టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ప్రోగ్రాం అమలు దిశగా సీఎం పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అమలు ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్ నిధుల విడుదలను వేగవంతం చేయడంపై ఈ వీసీలో చర్చించారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్వర్ ఆస్తులను డిజిటల్ భారత్నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై సమాలోచనలు చేశారు. వీటిపై సింధియా సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
టీ-ఫైబర్ నెట్వర్క్ ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ అర్కిటెక్చర్ ద్వారా అనుసంధానించనున్నది. మొదటి దశలో దెబ్బతిన్న నెట్వర్క్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. ఈ వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బీ అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డీ అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

