బంజారాహిల్స్, నవంబర్ 6 : రెండేళ్లుగా మున్సిపల్‌శాఖను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్‌శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త తొలగింపు బాధ్యతలను పర్యవేక్షించాల్సిన జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి.
రోడ్డుపై చెత్త కనిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడ అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు బస్తీలు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలను గురించి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మున్సిపల్ శాఖను ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు. షేక్‌పేట, ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో చెత్త సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వెంటనే శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.