హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): వైస్చాన్స్లర్లు పైరవీలు, పరిచయాలను పక్కనపెట్టి పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కొత్త వీసీలంతా వర్సిటీల ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని, వాటికి పునర్వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. నూతనంగా బా ధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్‌చైర్మన్, పలు వర్సిటీల వీసీలు శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యా రు. ప్రఖ్యాత ఉస్మానియా వర్సిటీకి మం చి పేరుండే.. ఈ వర్సిటీ పరిస్థితేం బాగాలేదు. ఉస్మానియా, జేఎన్టీయూల్లో చదివితే గర్వంగా చెప్పుకునే రోజులుండే.. తిరిగి వర్సిటీ గౌరవం పెంచే దిశగా పనిచేయాలని సీఎం సూచించారు. మంచి పనులు చేసేందుకు వీసీలకు సహకరిస్తామని, తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయిలను అరికట్టాలని, విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. ఆర్జీయూకేటీలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, వీసీలు పాల్గొన్నారు.