జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లో రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడంతో ‘కంటోన్మెంట్ నియోజకవర్గంలో రూ.4వేల కోట్ల అభివృద్ధి ఇదేనా? అంటూ గురువారం పోస్టర్లు వెలిశాయి.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో రహదారులన్నీ గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతో గుంతల వద్ద రూ.4వేల కోట్ల కంటోన్మెంట్ అభివృద్ధి ఇదేనా? అని ప్రశ్నిస్తూ పలు రోడ్లపై ప్లకార్డులతో పోస్టర్లు వెలిశాయి. ప్లకార్డులు ఎవరు ఏర్పాటు చేశారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.