CM Revanth Reddy | రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
CM Revanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరనున్నారు. మ. 12.45 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటారు. మ. 12.45 నుంచి ఒంటి గంట వరకు కలెక్టరేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఉమ్మడి జిల్లా ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కలెక్టరేట్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై సమీక్షా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.45 వరకు భూత్పూర్ రోడ్డులోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

