Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) ఫైర్ అయ్యారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మీరు ఏం చేశారని ప్రజలు ఓట్లు వేస్తారంటూ చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నించారు. హౌసింగ్ కాలనీల్లో ఒక్క రూపాయి పనులైనా చేశారా?. పులివెందులకు మెడికల్ కాలేజీ వస్తే మీరే వద్దన్నారు. ఎన్నికల్లో ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఈ మూడేళ్లల్లో ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు.
‘చంద్రబాబు ఎంత బలహీనమైన ముఖ్యమంత్రో ఏపీ మొత్తానికి అర్థమైంది. వైఎస్సార్సీపీ కార్పొరేట్, కౌన్సిలర్ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. మధ్యాహ్నం 1:30కు నామినేషన్లు వేసుకోవచ్చని చెప్పి పోలీసులే అడ్డుకోవడం శోచమనీయమన్నారు.
ఓడిపోతామనే భయంతో వైసీపీ అభ్యుర్థులను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. కనీసం ప్రచారం కూడా వైఎస్సార్సీపీ నేతలను ప్రశాంతంగా చేసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక చర్యలన్నీ చేతకాని చంద్రబాబు హయాంలో జరుగుతున్నాయని, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు జరగలేదని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం ఏజెంట్లను, ఓటర్లను బ్లాక్ చేసి దొంగ ఓట్లు వేసుకోవడానికి పన్నాగం పన్నారని ఆరోపించారు. టీడీపీ నీచ ప్రణాళికలకు కోయ ప్రవీణ్ పూర్తిగా సహకరిస్తున్నాడు. టీడీపీ కుట్రలను ఎస్ఈసీ దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకెళ్లింది. ఫ్యాక్షనిజాన్ని చంద్రబాబు తట్టి లేపుతున్నాడు. చంద్రబాబు.. నీవు చేసే తప్పుడు పనులు చాలా దూరం వెళ్తాయి’ అని ఫలితం అనుభవించక తప్పదని ఎంపీ హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

