Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ గురించి చెప్పగానే భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు గుర్తుకొస్తాయి. ‘గదర్ 2’, ‘బోర్డర్ 2’, ‘జాట్’ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఆయన ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇక్కా’ సినిమాతో డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
Sunny Deol | బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ గురించి చెప్పగానే భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు గుర్తుకొస్తాయి. ‘గదర్ 2’, ‘బోర్డర్ 2’, ‘జాట్’ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఆయన ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇక్కా’ సినిమాతో డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ కోర్టు రూమ్ డ్రామా ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఈ సినిమా అంగీకరించే సమయంలో సన్నీ డియోల్ ఎదుర్కొన్న సందేహాల గురించి నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ షేక్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సన్నీ డియోల్ సినిమాలంటే అభిమానులకు యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణ. ‘గదర్’ సినిమాలో హ్యాండ్‌పంప్ సీన్ నుంచి ఆయన నటించిన పలు మాస్ చిత్రాల వరకు భారీ పోరాట ఘట్టాలు ప్రేక్షకులను అలరించాయి. అలాంటి స్టార్ హీరోను ఒక్క యాక్షన్ సీన్ కూడా లేని కోర్టు రూమ్ డ్రామాలో నటింపజేయడం చిత్ర బృందానికి సవాలుగా మారింది. ‘ఇక్కా’ కథ విన్నప్పుడు సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేదని సన్నీ డియోల్ మొదట సందేహం వ్యక్తం చేశారట. ఈ విషయాన్ని రుచికా కపూర్ షేక్ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అయితే ఓటీటీ వేదికపై ప్రేక్షకులు కొత్త తరహా కథలను కూడా ఆదరిస్తున్నారని, కోర్టు రూమ్ డ్రామాలో సన్నీని భిన్నమైన పాత్రలో చూపించే అవకాశం ఉందని ఆయనకు వివరించినట్లు చెప్పారు. ఈ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇస్తుందని ధైర్యం చెప్పినట్లు వెల్లడించారు.
సన్నీ డియోల్‌ను ఓటీటీ సినిమాకు ఒప్పించడం కూడా అంత సులభంగా జరగలేదట. నాలుగు దశాబ్దాలకు పైగా వెండితెరపై స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయనతో ఓటీటీ అరంగేట్రం గురించి మాట్లాడిన ప్రతిసారీ సరదాగా నవ్వేవారని రుచికా తెలిపారు.తనకు 60 ఏళ్లకు పైగా వయసు వచ్చిందని, ఇప్పుడు కొత్తగా డెబ్యూ చేయడం ఏమిటని సన్నీ డియోల్ సరదాగా వ్యాఖ్యానించేవారట. అయితే ఓటీటీ ద్వారా తనను తాను కొత్త కోణంలో ఆవిష్కరించుకునే అవకాశం ఉందని చిత్ర బృందం నచ్చజెప్పింది. చివరకు చిత్ర బృందం నమ్మకాన్ని గౌరవించిన సన్నీ డియోల్ ఈ సినిమాకు అంగీకరించారు. మీ నమ్మకంపై తనకు విశ్వాసం ఉందని, సినిమా కోసం వంద శాతం కష్టపడతానని చెప్పినట్లు రుచికా వెల్లడించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో రూపొందిన ‘ఇక్కా’లో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషించారు. కోర్టు నేపథ్యంలోని ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సన్నీ డియోల్‌ను ఆయన సాధారణ యాక్షన్ హీరో ఇమేజ్‌కు భిన్నంగా చూపించడం ఈ చిత్రంలోని ప్రత్యేకత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ikka
- ott
- ruchikaa kapoor
- Sunny Deol
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

