Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
Heavy rains | తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిషాలో(Andhra-Odisha border) వర్షాలు దంచికొడు తున్నాయి.
Heavy rains | తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిషాలో(Andhra-Odisha border) వర్షాలు దంచికొడు తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీలోని(Andhrapradesh) మహేంద్ర తనయ నదికి భారీగా వరద వచ్చి చేరుతున్నది. వరద ప్రవాహంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాతపట్నం-పర్లాకిమిడి NH-326A రహదారిని అధికారులు మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు బాహుదానది ఉగ్రరూపం దాల్చడంతో ఇచ్ఛాపురం మండలంలోని నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఓ వైపు అర్ధరాత్రి తుఫాన్ ప్రభావం.. మరోవైపు ఒడిశా ప్రభుత్వం భగలట్టీ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో నదిలో వరద ఉద్ధృతి పెరిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోమోనని భయాందోళ నలకు గురవుతున్నారు. అలాగే పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా, 16వ నంబర్ జాతీయ రహదారి పూర్తిగా జలమయం కావడంతో కోల్‌కతా నుంచి చెన్నై రాకపోకలు సాగించే లారీలు, బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

