MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
MP Manoj Tiwari: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఇవాళ యమునా నదిలో దూకారు. ఆ నీటిలో ఈత కొట్టి స్నానం చేశారు. సోనియా విహార్ ఘాట్‌లో నీటిని తాగారు. యమునా నది క్లీన్ అయినట్లు చెప్పారు. కేజ్రీ, రాహుల్ కూడా నదిలో స్నానం చేయాలని కోరుతూ వీడియో షేర్ చేశారు.
న్యూఢిల్లీ: యమునా నదిలో తీవ్రమైన కాలుష్యం ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ(MP Manoj Tiwari) ఇవాళ యమునా నదిలో దూకారు. ఆ నీటిలో ఈత కొట్టి స్నానం చేశారు. ఇంకా ఆ నీటిని తాగారు కూడా. సోనియా విహార్ ఘాట్‌లో ఆయన స్విమ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. రెండున్నర ఏళ్లుగా రేఖా గుప్తా ప్రభుత్వం యమునా నదిని శుభ్రం చేసినట్లు ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఇప్పుడు యమునా నదిలో ఛాత్ పూజను సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నారు. కొన్ని ప్రదేశాల్లో వలస పక్షులు కనిపిస్తున్నాయని, అంటే నది శుభ్రంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నది స్వచ్ఛంగా ఉంటేనే వలస పక్షులు వస్తాయని, ఇక్కడ మొసళ్లు కూడా ఉండి ఉంటాయన్నారు. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కూడా వచ్చి యమునా నదిలో మునక వేయాలని ఎంపీ మనోజ్ తివారీ తన ఎక్స్‌లో కోరారు.
केजरीवाल जी और राहुल गांधी जी, यह रील नहीं, हकीकत है।
यह दिल्ली की ही यमुना जी हैं। आज मैंने यहाँ स्नान भी किया और आचमन भी किया।
केजरीवाल जी राहुल गांधी जी आप कब आ रहे हो डुबकी लगाने?
@ArvindKejriwal @RahulGandhi https://t.co/cjrvQNUCqN
— Manoj Tiwari (@ManojTiwariMP) October 29, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

