CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో బుధవా రం ఉదయం జైపూర్ వెళ్లి, వారి బంధువుల వివాహంలో పాల్గొననున్నా రు. అనంతరం అటునుంచి ఆయన ఢి ల్లీ వెళ్లనున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఏడాది కాలంలో రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లటం ఇది 28వ సారి.
నామినేటెడ్ పోస్టుల భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం తో సీఎం మాట్లాడనున్నారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా క్యాబినేట్ విస్తరణపై సీనియర్ కాంగ్రెస్ నేత లు, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదని ప్రచారం జ రుగుతున్నది. రేవంత్‌రెడ్డి వలస కాంగ్రె స్ నేతలకు ఎక్కువ పదవులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. పాత కాపులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎం వలస నేతల పేర్లు ఢిల్లీకి సిఫారసు చేయగా.. హైకమాండ్ తిరస్కరించినట్టు సమాచారం. ఈసారైనా ఢిల్లీ టూర్‌తో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్‌కు తెరపడుతుందా? అన్న చర్చ జరుగుతున్నది.