హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఢిల్లీకి(Delhi) వెళ్లునున్నారు. సాయంత్రం 5.30గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. రేపు ఢిల్లీలో జరుగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో(Congress Party Working Committee Meeting) పాల్గొంటారు. సీఎం రేవంత్‌తో పాటు పలువురు ఎంపీలు కూడా వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సరళిపై అధిష్ఠానానికి వివరించనున్నట్లు సమాచారం.