Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ సభలో మళ్లీ అబద్ధాలే చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిందని మళ్ల దుష్ప్రచారం చేశారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,85,340 కోట్లు మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో లెక్కలతో సహా వివరించారు. రేవంత్ సర్కారు కేవలం 11 నెలల కాలంలో నే తెచ్చిన రుణం రూ.77,118 కోట్లు. ఈ లెక్కన ఐదేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పు చేసే అవకాశం ఉన్నది. వరంగల్ సభలో సీఎం రేవంత్మాట్లాడుతూ.. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి నెలకు రూ.18,500 కోట్ల ఆదాయం వస్తున్నది. ఇందులో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు చెల్లిస్తున్నాం. మరో 6,500 కోట్లు గత ప్రభు త్వం చేసిన అప్పు, వడ్డీలకు చెల్లిస్తున్నాం. రూ.13,000 కోట్లు చెల్లింపులకు పోగా, మిగిలిన రూ.5,500 కోట్లతో పాలన సాగిస్తు న్నాం’ అని చెప్పుకొచ్చారు. రేవంత్ చెప్పినవి పచ్చి అబద్ధాలు అని వివరించడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం.
డిసెంబర్ 23న రేవంత్ సర్కారు ఇచ్చిన శ్వేతపత్రంలో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పు 72,658 కోట్లు. అంటే.. రూ.5,16, 881 కోట్ల నుంచి వారసత్వంగా వచ్చిన రూ.72,658 కోట్ల అప్పును తీసివేస్తే మిగిలేది రూ.4,44,223 కోట్లు. తెలంగాణ ఏర్పడక ముందు ఎస్పీవీల ద్వారా గత ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.11,609 కోట్లు. ఈ మొత్తా న్ని కూడా రూ.4,44,223 కోట్ల నుంచి తీసివేస్తే మిగిలేది రూ.4,32,614 కోట్లు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న రూ.6,115 కోట్ల అప్పు ను కూడా ఈ శ్వేతపత్రంలో తెలివిగా బీఆర్ఎస్ ఖాతాలో వేశారు. అవి కూడా తీసివేస్తే మిగిలే అప్పు రూ.4,26,499 కోట్లు.
కేంద్ర ప్రభుత్వం ఉదయ్ సీం తీసుకొచ్చి డిసంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని చట్టం చేయడం వల్ల రూ.9 వేల కోట్ల అదనపు అప్పు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నెత్తిన పడింది. గ్రాంట్ల రూపంలో రూ.17,558 కోట్ల అప్పు, కొవిడ్ కారణంగా 2021-22లో 10,784 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రం అనివార్యంగా 41,159 కోట్ల అప్పు తీసుకోవాల్సిన పరిస్థితికి కేంద్రం నెట్టింది. పైన పేర్కొన్న రూ.4,26,499 కోట్ల నుంచి ఈ రూ.41,159 కోట్ల అప్పును కూడా తీసివేస్తే.. నికరంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,85,340 కోట్లు మాత్రమేనని గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థికశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు వివరించారు.
అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే రేవంత్ సర్కారు ప్రజలపై భారీగా అప్పుల భారం మోపింది. డిసెంబర్ 7న అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ నెల 12 వరకు.. అంటే 341 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.77,118 కోట్ల అప్పు చేసింది. తెలంగాణ జనాభా 4 కోట్లు కాగా, ఒ క్కొక్కరి తలపై 19,27 9 అప్పుల భారాన్ని మోపింది. రోజుకు రూ.226 కోట్లు, వారానికి రూ.1,562 కోట్లు, నెలకు రూ.6,780 కోట్ల చొప్పు న కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు సేకరిస్తున్నది. ఆర్బీఐ నుంచే 52,118 కోట్ల అప్పు తీసుకుంది. అవి సరిపోక కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు రూ.25 వేల కోట్ల గ్యారంటీలు ఇచ్చిం ది. ఏడాదికి 1 లక్ష కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.5 లక్షల కోట్ల రుణం సమీకరించే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.