హైదరాబాద్,అక్టోబర్ 24 (నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 55వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతోపాటు పార్టీ కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో కొత్త డీసీసీల నియామకంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.