హైదరాబాద్, ఏప్పిల్ 10(నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్‌రెడ్డి అనాసక్తిగా ఉన్నట్టున్నారు. నియోజకవ ర్గాల సంఖ్యను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం లేదని చెప్పారు. సీడబ్ల్యుసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన, శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. నియోజకవర్గాల పెంపుతో అన్యాయం జరుగుతుందని, చిన్నరాష్ర్టాలు వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవే అంశాలను సీడబ్ల్యూసీ సమావేశాల్లోనూ చెప్పానన్నారు. నియోజకవర్గాల పెంపు అనేది పార్టీల సమస్య కాదని, ప్రాంతాల సమస్య అని చెప్పారు. నియోజకవర్గాలు పెంచి మహిళా రిజర్వేషన్లు ఇచ్చే బదులు ఇప్పుడున్న 543 సీట్లలో 181సీట్లను మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పేట్ బషీరాబాద్, నిజాంపేట స్థలాల మీద జర్నలిస్టు సొసైటీలకు ఎలాంటి హక్కులు లేవని, అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని సీఎం పరోక్షంగా స్పష్టంచేశారు.