Talasani Srinivas Yadav | అందరి సహకారంతో ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | భక్తులందరీ సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఘనంగా నిర్వహించినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : భక్తులందరీ సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ ( Balkampet Yellamma ) కల్యాణం ఘనంగా నిర్వహించినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) అన్నారు. బుధవారం బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవాన్ని ఆయన శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల సమక్షంలో అమ్మవారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పారు.

ఆలయ పరిసర ప్రాంత ప్రజలు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరి సంపూర్ణ సహకారంతో నే అమ్మవారి కల్యాణం, రథోత్సవం జరిగిందని అన్నారు. అమ్మవారి దీవెనలతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో వినోద్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, కట్టా బలరాం, రాజేష్ ముదిరాజ్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, పీయూష్ గుప్త, గిరి యాదవ్, సురేందర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

