బెంగళూరు: వర్షాలు అంతగా కురువకపోవడంతో తీవ్ర నీటి సంక్షోభంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల చెరువు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని ముట్టడించారు. ఆ కొలనులోని నీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. (Farmers Storm Steel Factory) కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆ జిల్లాలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. దీంతో రైతులు కరువుబారిన పడ్డారు.
కాగా, స్థానిక బల్దోట ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీలో 22 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉన్నది. అలాగే సారవంతమైన వ్యవసాయ భూములను ఆ సంస్థకు ప్రభుత్వం అప్పగించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం నీటి సంక్షోభం నేపథ్యంలో రైతులు పోరుబాటపట్టారు. మంగళవారం గవి సిద్ధేశ్వర మఠం ప్రాంగణం నుంచి ఫ్యాక్టరీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు కొందరు ఆందోళనకారులు ఫ్యాక్టరీ కాంపౌండ్ గోడ పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. ప్రజల వినియోగం కోసం చెరువు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. రైతులతో చర్చలు జరిపారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ నిరసన విరమించారు. అయితే రైతుల ఆందోళనపై ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైతుల నిరసనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Farmers Storm Baldota Factory, Break Main Gate and Breach Compound Wall
Koppal: The farmers’ protest on the occasion of #Farmers’ Martyrs’ Day turned volatile as hundreds of protesters stormed the #Baldota factory premises by breaking the main entrance… pic.twitter.com/jTqjjzb0J3
— Mahesh M Goudar (@IamMGoudar) July 21, 2026