Ayesha khan | నీట్ స్కాం కారణంగా విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరిగిందని తెలిసిందే. విద్యార్థులపై పోలీసులు దాడిని నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా కూడా చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో చేపట్టిన నిరసన సెగ హైదరాబాద్‌కు కూడా తగిలింది. ఇప్పటికే పలువురు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విద్యార్థులకు మద్దతు తెలియజేశాడు.
విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న ధురంధర్ ఫేం నటి అయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురించి అయేషా ఖాన్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. నా చేతులు ఇప్పుడు అక్షరాలా వణికిపోతున్నాయి. కేవలం రోడ్డు మీద ప్రశాంతంగా నిలబడినందుకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్‌లో నిర్బంధించారంటూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన ఆవేదనను తెలియజేసింది.
నీట్ (NEET) విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు తాను తన సోదరుడు, కొందరు స్నేహితులతో కలిసి దాదర్‌కు చేరుకున్నామని.. ఆ ప్రదేశంలో నిరసనలకు అనుమతి లేదని తనతోపాటు మిగిలిన వారిని వోర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారని చెప్పింది అయేషా ఖాన్.
అయేషాఖాన్ను పోలీసులు బలవంతంగా వ్యాన్‌లో ఎక్కిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దురంధర్ ‘షరారత్’ పాటతో మంచి ఫేం సంపాదించింది అయేషా ఖాన్. హైదరాబాద్‌లో ఇప్పటికే లోక్‌భవన్ వద్ద విద్యార్థుల నిరసన చేపట్టారని తెలిసిందే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు తెలంగాణ లోక్ భవన్ వెలుపల ఆందోళన చేపట్టాయి.