Sonam Wangchuk : పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన అక్కడే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన దీక్ష విరమించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రులు సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రిలో కలిశారు. దీక్ష విరమించాలని కోరారు.
ఈ నేపథ్యంలో తన నిరాహార దీక్ష విరమణపై సోనమ్ కీలక ప్రకటన చేశారు. సీజేపీ ఆందోళనకారులు, యువతపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇస్తే తాను దీక్ష విరమించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నద్దా, జితేంద్ర సింగ్‌లకు లేఖ రాశారు. ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన కోరారు. ఇదే సమయంలో తనను కలిసిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తన డిమాండ్ల విషయంలో కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సోనమ్ తెలిపారు. పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించేందుకు మంత్రులు అంగీకరించినట్లు, జవాబుదారీగా ఉండనున్నట్లు మంత్రులు హామీ ఇచ్చినట్లు చెప్పారు.
AN APPEAL TO THE GOVERNMENT
regarding breaking my fast…
Once the assurance from govt come I will also appeal to the peacefully protesting students to halt the movement for now and enter into dialogue with the government pic.twitter.com/gR6S8woF5R— Sonam Wangchuk (@Wangchuk66) July 22, 2026
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని పరిశీలిస్తామని కూడా తెలిపినట్లు చెప్పారు. అలాగే, ఇకపై ఆందోళనకారులపై పోలీసు బలగాల్ని ఉపయోగించబోరని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మరోవైపు వాంగ్చుక్ను కలిసేందుకు ఎంపీలు బయల్దేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో 50 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకాలతో కూడిన ఒక లేఖను వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలికి అందించారు.