Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తనదైన స్టైల్లో చురకలంటించారు. లీడర్లు ఎక్కడికైనా ఎందుకు పోతరు.. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేయాలి. ఈయన దండయాత్రకు పోతడట.. దండయాత్ర చేయడానికి ఏమైనా శత్రు రాజ్యమా..? యెనకట రాజులు పక్క దేశం మీద దండయాత్ర చేస్తుండేవాళ్లు. సిరిసిల్ల తెలంగాణలో లేదా..? అని ప్రశ్నించారు.
4 వేల మంది పోలీసులు.. పొద్దున 4 గంటల నుంచి నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను, ఉద్యమకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. దేనికోసం పోతున్నవ్ సిరిసిల్లకు. బీఫోర్ కేటీఆర్.. ఆఫ్టర్ కేటీఆర్ ఏందో ఒక్కసారి సిరిసిల్ల ప్రజలను అడగండి వాళ్లు చెప్తరని హరీశ్ రావు హితవు పలికారు. ఎంత ఆదర్శంగా.. ఎంత అద్భుతంగా సిరిసిల్ల తయారైందో.. కేటీఆర్ రాకముందు సిరిసిల్ల ఎట్లుంటే.. కేటీఆర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లా మారిందో ఆ సిరిసిల్ల ప్రజలను అడుగు.. వాళ్లు చెప్తరని రేవంత్ రెడ్డికి సూచించారు.
నువ్వు బయట నుంచి కొంతమంది గూండాలనో, కార్యకర్తలనో, సివిల్ డ్రెస్‌లో పోలీసోళ్లను పెట్టుకొని పోయినంత మాత్రాన సిరిసిల్ల ప్రజల తలరాతలు మారవన్నారు. సిరిసిల్ల ఆదర్శనియోజకవర్గం అయిందంటే.. అక్కడున్నరైతులకు కాళేశ్వరం జలాలు వచ్చినయంటే.. మానేరు మీద చెక్‌డ్యామ్‌లు వచ్చినయంటే..సిరిసిల్ల మున్సిపాలిటీ ఆదర్శంగా అభివృద్ధి జరిగిందంటే.. దాని వెనుక కేటీఆర్ కృషి ఉంది. నిజంగా నువ్వు ప్రజల మనసు గెలవాలంటే మేం పని చేసినదానికంటే ఎక్కువ పని చేయ్.. ఎక్కువ పథకాలు ఇయ్యు.. ఎక్కువ డబ్బులు ఇచ్చి ప్రజల మనసు గెలవాలి కానీ.. పోలీసోళ్లనో, గూండాలనో పెట్టుకొని దండయాత్ర చేస్తానంటే..నీ చౌకబారు మాటలను ప్రజలు హర్షించరు.
నువ్వు సిరిసిల్లలో నేర్చుకొని రా.. చేనేత కార్మికులకు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో..? ఆ వరుస చెక్‌డ్యామ్‌లు కడితే ఆ మానేరు పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అద్భుతమైన పంటలు ఎట్లా పండినయో. చూసి నేర్చుకొరా రేవంత్ రెడ్డి.. ఇది రాష్ట్రానికి ఉపయోగపడ్తదన్నారు హరీశ్ రావు.
సిరిసిల్ల మీద దండయాత్ర చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు
దండయాత్ర చేయడానికి అదేమైనా శత్రు రాజ్యమా?సిరిసిల్ల కూడా తెలంగాణలో భాగమే కదా?
4,000 మంది పోలీసులతో వెళ్లాల్సిన అవసరం ఏంటి?
– హరీష్ రావు https://t.co/f6U8qnaoWY pic.twitter.com/97ddMCO0mW
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2026
బిఫోర్ కేటీఆర్ ఆఫ్టర్ కేటీఆర్ సిరిసిల్ల ఎలా అయిందో అక్కడి ప్రజలను అడిగి తెలుసుకో రేవంత్ రెడ్డి
– హరీష్ రావు https://t.co/UDhzcKvMgU pic.twitter.com/TzFBOwa7oq
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2026
Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్‌తో రచ్చ!