హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి దవాఖానకు బేడీలతో ఎందుకు తీసుకెళ్లారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై ఢిల్లీ నుంచి అధికారులను ఆరా తీశారు.
రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.