CM Revanth Reddy | హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలన్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఏడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Tirumala Income | ఆగస్టు నెలలో శ్రీవారి ఆదాయం రూ. 125.67 కోట్లు
Srisailam Project | కృష్ణమ్మకు పోటెత్తిన వరద.. శ్రీశైలం 6 గేట్లు ఎత్తివేత..
Bhadrachalam | భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి నీటిమట్టం