CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని రూ.12 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అనంతరం సీఎం మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి రైతు భరోసాను ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని స్పష్టంచేశారు.
వ్యవసాయ యోగ్యం కాని భూములకు, రాళ్లు-రప్పలు, గుట్టలు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ జరిగిన భూములకు, పరిశ్రమల కోసం తీసుకున్న భూములకు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఉండదని తెలిపారు. భూమి లేని రైతు కుటుంబాలకు ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అనే పేరు పెట్టినట్టు చెప్పారు. దీంతోపాటు కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఈ పథకాలన్నీ ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు.
మరిన్ని క్యాబినెట్ నిర్ణయాలు