హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆదివారం అంబేదర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. సిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్లకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పథకాల అమలు సందర్భంగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉన్నదని స్పష్టం చేశారు.
పదేండ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని వీసీలకు సూచించారు. యూనివర్సిటీల ప్రైవేటీకరణ ఆలోచన మంచిది కాదని హితవు పలికారు. యూజీసీ నిబంధనల్లో మార్పులు చేసి, రాష్ట్రాల పరిధి నుంచి వాటిని తప్పించి.. యూనివర్సిటీలపై పెత్తనం చెలాయించాలని కేంద్ర కుట్రలు పన్నుతున్నదని తెలిపారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమ హకులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. రాష్ట్రాల అధికారాలను ఒకొకటిగా కేంద్రం గుంజుకుంటే.. రాష్ట్రాలు కేవలం పన్నులు వసూలు చేసే సంస్థలుగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.
పద్మ అవార్డుల్లో అన్యాయం
పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం మండిపడ్డారు. గద్దర్, చుకా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ప్రధానికి ఈ విషయంపై లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రంలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ అండగా నిలబడ్డ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.