Telangana | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రైతు భరోసాపై క్యాబినెట్లో మంత్రు ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని సమాచారం. ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసాకు సంబంధించిన ప్రతిపాదనను మంత్రుల ముందుంచి, ఎకరాకు 15 వేల చొప్పున ఇస్తే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని వివరించారని తెలిసింది. కాబట్టి ముందుగా రూ.12 వేలకు పెంచాలని భావిస్తున్నట్టు చెప్పారని సమాచారం.
ఈ సందర్భంగా నలుగురు కీలక మంత్రులు కలుగజేసుకొని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు గా రూ.15 వేలకు పెంచాలని సూచించినట్టు తెలిసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పామని, ఇప్పటికే ఏడాది ఆలస్యం అయ్యిందని, రైతులు గుర్రుగా ఉన్నారని చెప్పినట్టు సమాచారం. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ప్రభావం చూపిస్తుందని, కాబట్టి, ఎన్నికల హామీ మేరకు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. కానీ, సీఎంకు అనుకూలంగా ఉన్న మరికొందరు మంత్రులు మాట్లాడుతూ.. రా ష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుకోకుండా అడిగితే ఎలా? అని ప్రశ్నించినట్టు సమాచారం.
ముందుగా రూ.12వేలు ఇద్దామని, ఆర్థిక వెసులుబాటును బట్టి మరికొంత పెంచుదామని ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. ఇలా సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం సీఎం స్పందిస్తూ.. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.12 వేలు మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని మీడి యా ముందుకొచ్చి ఎవరు చెప్పినా ప్రజల్లో బదనాం అవుతారని కొందరు మంత్రులు చె ప్పడంతో.. తానే మీడియా ముందు మాట్లాడుతానని సీఎం చెప్పినట్టు తెలుస్తున్నది. సా ధారణంగా క్యాబినెట్ బ్రీఫింగ్ బాధ్యతను మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం కు అప్పగించారు. కానీ, ఈసారి ప్రత్యేకంగా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి వివరాలు వెల్లడించడానికి ఇదే కారణమని చర్చ జరుగుతున్నది.