Chakali Ilamma | హైదరాబాద్ : కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని మా ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తాం. భూస్వాముల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ‘గ్యారెంటీ’లు అమలు చేయలేక ‘గంజాయి’ సాగా..? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Medical Colleges | మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
KTR | ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. బుల్డోజర్ ప్రభుత్వం..! రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం