హైదరాబాద్ : రాజీవ్ గాంధీ( Rajiv Gandhi) ఒక స్ఫూర్తి. 1980 దశకంలోనే దేశానికి సాంకేతిక పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు (Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ స్పూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న సచివాల యం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాదని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, వి.హనుమంతరావు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు ఉన్నారు.