హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన సీఎస్ శాంతికుమారితో మాట్లాడుతూ…రెవెన్యూ,మున్సిపల్, విద్యు త్తు, వై ద్యారోగ్య శాఖాధికారులను అప్రమ త్తం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాం తాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ విధమైన ప్రాణ, ఆస్తినష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ కలెక్టరేట్‌తోపాటు జీహెచ్ఎంసీ, సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్‌లను తెరవాలని చెప్పారు. వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకం గా నియమించాలని చెప్పారు. పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించుకొనే నిర్ణయం కలెక్టర్లు తీసుకోవాలని స్పష్టంచేశారు. వరద ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
వైద్య సిబ్బందికీ ..
వర్షాలు తగ్గే వరకు వైద్యులకు, సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని, డాక్టర్లతోపాటు సిబ్బంది అంతా విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అంబులెన్స్ సర్వీసులు, ఔషధాలు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గర్భిణులను హాస్పిటళ్లకు తరలించి, వెయిటింగ్ రూమ్స్ కేటాయించాలని ఆదేశించారు. దోమల బెడదను నివారించేందుకు పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు.
అధికారులు సెలవులు పెట్టొద్దు భారత వాతావరణశాఖ రెడ్అలెర్ట్
ప్రకటించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖాధికారులు సెలవులు పెట్టొద్దని,అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను వదిలివెళ్లొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీచేశారు. రిజర్వాయర్లు, చెరువుల నీటి స్థాయిలను పర్యవేక్షించాలని సూచించారు. ఓవర్‌ఫ్లోను నిరోధించడానికి గేట్లు, స్పిల్‌వేల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. డ్యామ్‌లు కట్టలు, కాలువను తనిఖీ చేయాలని ఆదేశించారు.