హైదరాబాద్ , మార్చి18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ వేదికగా అసహనంతో, అసందర్భ ప్రేలాపనలతో సీఎం రేవంత్ ప్రసంగం సాగింది. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అడ్డగోలుగా చిందులు తొక్కా రు. ఉన్నతమైన శాసనసభలో ఉన్నామని, లైవ్ ద్వారా తెలంగాణ సమాజం అంతా చూస్తున్నదన్న విషయాన్ని మరచి, సీఎం స్థాయి నుంచి దిగజారి మాట్లాడారు. ‘నెత్తి మీద కాలుపెట్టి తొక్కుకుంటూ వచ్చిన, 2029లో మళ్లీ తొక్కుకుంటూ పోత అంటూ సవాల్ విసిరారు. తొ క్కుతా.. నార చీరుతా.. నరుకుత, కుప్పలు పెడుత అంటూ ఊగిపోయారు. నోటికొచ్చిన రీతిలో దూషణలకు దిగారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన రేవంత్.. బీఆర్ఎస్ నేతలపై దుర్భాషలాడారు. రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం ఉద్యమించి, పదేండ్లు రాష్ట్రానికి దశా దిశను నిర్దేశించి, దేశంలోనే తెలంగాణను అన్నిరంగా ల్లో ఆదర్శంగా నిలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై తిట్ల దండకం అందుకొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను ఎందుకు కూలగొడుతున్నారు? 6 గ్యారెంటీలను ఇప్పటివరకు ఎందు కు అమలు చేయలేదు? అని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నించడాన్ని తట్టుకోలేక, అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. ఎప్పటి మాదిరిగానే సీఎం రేవంత్‌రెడ్డి తిట్ల దండకం అందుకొన్నారు.
తెలంగాణ సభలో అనుచిత భాష
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిండు అసెంబ్లీలోనే రేవంత్ ఆంధ్రా నేతలను ఆకాశానికి ఎత్తారు. తన గురువు చంద్రబాబు నాయుడును గొప్పగా కీర్తిస్తూ ఉద్యమ నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతల పోరాటాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారు. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలతో ఉద్యమ నేతలు పదవులు పొందిన ట్టు, పాలమూరు ఎంపీగా కేసీఆర్‌ను తానే గెలిపించినట్టు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వల్లెవేశారు. తెలంగాణ ప్రజల తీర్పునే అవమానించేలా మాట్లాడారు. బుధవారం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ఆయన తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందులో భాగమే దుర్భాషను ఆశ్రయించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
వరిసాగు వద్దు..
రాష్ట్రంలో వరిసాగుపై శాసనసభ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరి ఒక్కటే పరిష్కారం కాదని, వరి పండించడం తో రైతులకు పెద్దగా లాభం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరి పంట నుంచి దృష్టి మరల్చి కమర్షియల్ పంటలు సాగు చే యాలని పిలుపునిచ్చారు. తద్వారా సీఎం రేవంత్ రాష్ట్రంలో వరిసాగు చేయొద్దని పరోక్షంగా రైతులకు సూచించడం గమనార్హం. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మా ట్లాడిన సందర్భంగా సీఎం ఆ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పంటమార్పిడి విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. తద్వారా వరి సాగును ప్రోత్సహించొద్దని పరోక్షంగా సూచించారు. పంట వైవిధ్య విధానం అమలుపై జిల్లాల్లో చర్చ పెట్టాలని, ఈ చర్చల్లో రైతులను సైతం భాగస్వాములను చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావుకు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచించారు.
27 నెలల్లో 3.47 లక్షల కోట్ల అప్పు చేసినం
శాసనసభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను సీఎం రేవంత్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 27 నెలల్లో రూ.3.47 లక్షల కోట్ల అప్పులు చేసిన ట్టు వివరించారు. రూ.17 వేల కోట్లు మాత్ర మే ప్రజల కోసం వినియోగించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని, సన్నవడ్లకు బోనస్ ఇచ్చిందని, ప్రతి సీజన్లో 9 వేల కోట్లు రైతుభరోసా కింద పంపిణీ చేసిందని తెలిపారు.