Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Gangula Kamalakar | ఆనాడు సీఎం కిరణ్ కుమార్ ఈ హైదరాబాద్ చుట్టు పక్కల బీసీ సంఘాలకు 5 గుంటల భూమి ఇవ్వండి అంటే వెకిలిగా నవ్వి.. బీసీ సంఘాలకు ఒక ఆశ్రమం కావాలా..? అని నవ్విన పరిస్థితి ఉండేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
Gangula Kamalakar | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మా కడుపు నిండా అన్నం పెట్టి కాపాడారని.. కానీ బీసీ వ్యతిరేకంగా ఉన్నరేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేదిక మీదున్న మాతోపాటు ఉన్న మధుసూదనాచారి, శ్రవణ్ కుమార్, విప్ వివేకానంద, ఎమ్మెల్యేలతోపాటు మేమంతా కూడా బీసీ బిడ్డలం.. ఒకసారి మీకు గత చరిత్రను పత్రికల ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు.
కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011-12 సంత్సరంలో పొన్నం ప్రభాకర్ కూడా బీసీ సంఘాల్లో తిరిగిండు.. నేను కూడా బీసీ సంఘాల్లో తిరిగానని ఎమ్మెల్యే గంగుల గుర్తు చేశారు. ఆనాడు సీఎం కిరణ్ కుమార్ ఈ హైదరాబాద్ నడిఒడ్డున బీసీ సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే.. మా బీసీ సంఘాలకు హోటళ్లలో కూడా మీటింగ్ ఉండదు కాబట్టి ఎక్కడన్నా చుట్టు పక్కల బీసీ సంఘాలకు 5 గుంటల భూమి ఇవ్వండి అంటే వెకిలిగా నవ్వి.. బీసీ సంఘాలకు ఒక ఆశ్రమం కావాలా..? అని నవ్విన పరిస్థితి ఉండేది. తిరుగగా తిరుగగా నాగార్జున సాగర్ రోడ్లులో 120 కిలోమీటర్ల దూరంలో 5 గుంటల భూమిని ఒక స్మశాన వాటిక పక్కన చూపించిన పరిస్థితి ఉన్నది.. అంటూ బీసీ సంఘాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమున్నప్పుడు వెకిలిగా నవ్వి అవమానం చేసిన పరిస్థితి ఉండేదన్నారు.
కోకాపేటలో ఆత్మగౌరవ భవనాలు..
కనీసం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్‌లో ఒక గుంట భూమి కూడా లేని పరిస్థితి ఉంది. ఆ పరిస్తితి తెలుసుకుని కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే.. బీసీలంటే సమాజంలో 60-70 శాతమున్న వ్యక్తులు కాబట్టి మీ ఓట్లతోనే ప్రభుత్వాలు నడుస్తయి కాబట్టి మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాది… ప్రప్రథమంగా, ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఆ రోజు 2018లో జీవో నంబర్ 189 ప్రకారం మీ గౌరవాన్ని కాపాడుతం..అందుకే దాని పేరు ఆత్మ గౌరవ భవనాలని చెప్పారని ఎమ్మెల్యే గంగుల స్పష్టం చేశారు.
భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం జీవో 189 ద్వారా 87.5 ఎకరాల భూమి.. ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం ఆర్తిక ఇబ్బందులు రాకుండా ఆ డబ్బు కూడా నేను ఇస్తా అని చెప్పి ఎకరానికి కోటి రూపాయల చొప్పున 41 ఈ బీసీ కుల సంఘాలకు సుమారు 97.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఎక్కడిస్తారని అంటే.. మీ గౌరవాన్ని కాపాడతా అని చెప్పి రూ.100-150 కోట్ల విలువైన కోకాపేటలో మా అందరికీ ఆత్మగౌరవ భవనాలు ఇచ్చారన్నారు. దాంతోపాటు ఉప్పల్ భగాయత్‌లో ఇచ్చారన్నారు. ఆ తర్వాత మా దగ్గరకు సంఘాలు వచ్చినయి.. మేం సంతోషపడ్డాం. ముఖ్యమంత్రి కూడా కడుపునిండా అన్నం పెట్టి మా గౌరవాన్ని కాపాడిండని మా అదృష్టంగా భావించామన్నారు.
కానీ బీసీ వ్యతిరేకంగా ఉన్న రేవంత్ ప్రభుత్వం చీకటి జీవో 14 ఇవ్వడం జరిగింది. ఇందులో పాత 189 జీవోను రద్దు చేస్తున్నం.. ఇక నుంచి మాదే గుత్తాధిపత్యం.. మళ్లీ మీరు బానిసలుగా బతకండి.. గతంలో మా హయాంలో మీరు బానిసలుగాఉన్నరు.. మళ్లీ మీరు బానిసలుగా ఉండండి.. మీ ఆత్మగౌరవ భవనాలు లేవు.. మేమే ఆధిపత్యం చేస్తమని జీవో నంబర్ 14 ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ మీరు బీసీ బిడ్డ. బీసీ సంఘాల్లో తిరిగినం. ఈ జీవో ఇచ్చింది మీకు తెలుసా..? మీ డిపార్ట్మెంట్ ఇచ్చింది.. మరి జీవో ఇచ్చినంక కూడా మీరు ఎందుకు పెదాలు మెదపడం లేదని ప్రశ్నించారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం https://t.co/kN9NbtI6IW
— BRS Party (@BRSparty) November 5, 2026
Read Also :
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Dharmaram | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మారంలో షుగర్ నిర్దారణ పరీక్షలు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
SI Krishna Reddy | తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టిని సారించాలి : ఎస్సై కృష్ణారెడ్డి
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

