గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
గౌతమ్ పూర్ గ్రామంలోని స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోనే స్మశాన వాటికలో చేతిపంపు పని చేయడం లేదు. చేతి పంపు చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి నిరుపయోగంగా మారింది. దానికి మరమ్మతులు...
చుంచుపల్లి, నవంబర్ 05 : గౌతమ్ పూర్ గ్రామంలోని స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోనే స్మశాన వాటికలో చేతిపంపు పని చేయడం లేదు. చేతి పంపు చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి నిరుపయోగంగా మారింది. దానికి మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. దీపావళి సందర్భంగా గతించిన తమ ఆత్మీయులను స్మరించుకునేందుకు బంధువులు సమాధుల వద్దకు వెళ్లి శుభ్రం చేసి, నీటితో అలికి దీపాలు వెలిగించి నివాళులర్పిస్తారు. అయితే స్మశాన వాటికలో నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎవరైనా మృతి చెందినప్పుడు ఖననం చేసేందుకు లేదా దహన సంస్కారాలు నిర్వహించేందుకు అవసరమైన నీటిని కుండల్లో తీసుకెళ్లి చేతిపంపు ద్వారా నింపుకునేవారు. ప్రస్తుతం అది కూడా పనిచేయకపోవడంతో అంత్యక్రియల సమయంలోనూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సీసీ రోడ్డు లేక అవస్థలు
మరోవైపు స్మశాన వాటికకు వెళ్లే రహదారికి సీసీ రోడ్డు లేకపోవడంతో రహదారి ఎత్తుపల్లాలుగా, ఎగుడుదిగుడుగా ఉండి ట్రాలీలు, ఇతర వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారింది. అత్యవసర సమయంలో మృతదేహాలను తరలించేందుకు కూడా అవస్థలు తప్పడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి చేతిపంపునకు మరమ్మతులు చేపట్టి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు స్మశాన వాటికకు సీసీ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. స్మశాన వాటికలో కనీస సదుపాయాలు కల్పించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
తుంగతుర్తిలో దాశరధి కృష్ణమాచార్యులకి ఘన నివాళి
‘రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలి’
Foods | చలికాలంలో వ్యాయామం చేసే ముందు ఏ ఆహారం అయితే ఉత్తమం.. నిపుణులు ఏం సూచిస్తున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

