DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
DMHO Narendra Rathod | జాతీయ ఆరోగ్య మిషిన్ ఎన్హెచ్ఎం ఎం వైద్య సిబ్బంది ధర్నాలో ఉన్నందున వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మంచి ర్యాల జిల్లా డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ ఆదేశించారు.
తాండూర్ : జాతీయ ఆరోగ్య మిషిన్ ఎన్హెచ్ఎం( NHM ) ఎం వైద్య సిబ్బంది ధర్నాలో ఉన్నందున వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మంచి ర్యాల జిల్లా డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ ( DMHO Narendra Rathod ) ఆదేశించారు. తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు సిబ్బందితో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, నమోదు చేయడం, నిశ్చయ పోర్టల్‌లో అప్లోడ్ చేయడం, వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్టులను అందజేయాలన్నారు.
మాతా శిశు సంరక్షణ, గర్భవతుల నమోదు, ఆసుపత్రిలో ప్రసవాలు, అమ్మఒడి అంబులెన్స్ సర్వీస్ లను ఉపయోగించుకొనుట, కీటక జనిత వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటివి ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ సర్పంచులు, సిబ్బంది పరిశుభ్రతపై, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీ, సీహెచ్‌వో జయమేరీ, పర్యవేక్షకులు రమాదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Stock Market | ట్రంప్ ఓటమితో స్టాక్‌మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 2,100 పాయింట్లు జంప్..!
తుఫాన్ ధాటికి కొట్టుకుపోయిన లో లెవల్ చప్టా
AP News | పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును పగులగొట్టిన వైసీపీ..!
AP News | కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

