SI Krishna Reddy | తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టిని సారించాలి : ఎస్సై కృష్ణారెడ్డి
SI Krishna Reddy | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మలేగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన పోషకుల సమావేశంలో కుభీర్ ఎస్సై ఏ. కృష్ణారెడ్డి పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మలేగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన పోషకుల సమావేశంలో కుభీర్ ఎస్సై ఏ. కృష్ణారెడ్డి ( SI Krishna Reddy ) పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు.
ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుతో పాటు వారి ప్రవర్తన, స్నేహితుల ఎంపిక, రోజువారీ కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పిల్లలకు మంచి చెడుల మధ్య తేడాను తెలియజేస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్ పత్రాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షకీల్ అహ్మద్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SI Krishna Reddy | తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టిని సారించాలి : ఎస్సై కృష్ణారెడ్డి
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
తుంగతుర్తిలో దాశరధి కృష్ణమాచార్యులకి ఘన నివాళి
‘రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

