‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా...
– మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్
– తెలంగాణ మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
రుద్రంపూర్, నవంబర్ 05 : తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులని, పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా నాన్‌టెక్నికల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. అసెంబ్లీ హెల్పర్స్, వేర్‌హౌస్ ఆపరేషన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,283 స్థూల వేతనం, కోతల అనంతరం రూ.17,833 నికర వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా రూ.1,500 వరకు హాజరు బోనస్, నెలకు రూ.2,000 చెల్లింపుతో వసతి, ప్రతిరోజూ రెండు ఉచిత భోజనాలు, ఏసీ బస్సు రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రోజుకు ఎనిమిది గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని, వారానికి ఆరు రోజుల పని, ఒకరోజు సెలవు ఉంటుందని వివరించారు.
ఈ నెల 6, 7 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన మహిళలు అవసరమైన ధ్రువపత్రాలతో హైదరాబాద్ నాంపల్లి వద్ద గల మైనారిటీ స్టడీ సర్కిల్ నందు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8520860785, 6305385949 నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని, placementdrive@tgmsccc.comకు ఈ-మెయిల్ చేయాలని లేదా tgminoritiesstudycircle.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
SI Krishna Reddy | తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టిని సారించాలి : ఎస్సై కృష్ణారెడ్డి
గౌతంపూర్ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువు
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
తుంగతుర్తిలో దాశరధి కృష్ణమాచార్యులకి ఘన నివాళి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

