Jagadish Reddy | మానసిక రోగికి మించిన రోగి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంత తెలివి తక్కువగా మాట్లాడే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని విమర్శించారు. మానసిక శాస్త్రవేత్తలకు మంచి రీసెర్చ్ సబ్జెక్ట్ రేవంత్ రెడ్డి అని అన్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటే తెలంగాణలోనే ఉన్నామా? ఇంకెక్కడైనా ఉన్నామా అని అనుమానమేస్తోందని అన్నారు. మొన్నటి ప్రెస్‌మీట్‌కు ఈ రోజుకు తేడా ఏమైనా ఉందా అని అన్నారు. రోడ్ షోల్లో కేటీఆర్‌కు స్వాగతం చెబుతున్న ప్రజలను చూసి రేవంత్ రెడ్డికి మైండ్ దొబ్బినట్లు ఉందని విమర్శించారు. కేటీఆర్‌ను ఐటెం సాంగ్‌తో పోలుస్తావా అని మండిపడ్డారు. నీ మాటలు హద్దులు లేకుండా రేఖలు దాటుతుంటాయి.. నీ ఊహలు తారాతోరణాల్లా విహరిస్తుంటాయని అన్నారు. నీ రేఖలు హద్దులు దాటేది తెలుసు.. నీ తారాతోరణాల ఊహల గురించి తెలుసనని వ్యాఖ్యానించారు. నీకు అదే భాష వస్తుందని మండిపడ్డారు.
కల్వకుంట్ల కవిత, మాగంటి సునీత గురించి మాట్లాడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నీ సొంత అన్న కూతురి పెళ్లికి నీ భార్య, కుటుంబసభ్యులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఈ చిల్లర విషయాలు ఎందుకు అని మండిపడ్డారు. గోపీనాథ్ దిగజారుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావ్.. అవేమైనా ఓట్లు తెస్తాయా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ వాళ్లకే విసుగొచ్చిందని అన్నారు. ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగకు మొత్తం అధికారం ఇచ్చి దిగిపో అని హితవు పలికారు. చేతకాదని ఎందుకు ఆ సీట్లో కూర్చోవడం అని ప్రశ్నించారు. ఇంకెవరికి సీఎం పదవి ఇచ్చినా రేవంత్ రెడ్డి కంటే బాగా పనిచేస్తారని తెలిపారు.
రెండేళ్లలోనే సీఎం రేవంత్ రెడ్డి 30 వేల కోట్లు వెనకేసుకున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. నిర్మాణ రంగం కుదేలుతో లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. నీకు పరిపాల చేతకాక.. బీఆర్ఎస్ పనైపోయిందనడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది. ఎన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోలేదు? పని అయిపోయిందా అని ప్రశ్నించారు. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 40 ఏండ్లు అధికారానికి దూరంగా ఉందని తెలిపారు. మరి రాహుల్ గాంధీతో నీ పని అయిపోయిందని అంటున్నావా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డివి తెలివితక్కువ మాటలు, సోయిలేని మాటలు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ప్రముఖ నగరాలు, దేశాలకు వెళ్తే కేటీఆర్‌నే గుర్తుపడతారని చెప్పారు. కనకపు సింహాసనము మీద శునకాన్ని కూర్చోబెట్టినట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని విమర్శించారు.