హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని సమ్మెను విరమింపజేయాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.
ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నాడు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేశారని, తెలంగాణలో విలీనానికి అభ్యంతరాలేమి ట ని ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టింపుల కు పోకుండా సామరస్యంగా పరిషరించాలని కోరారు.