హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ) : సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం 38వసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్న ఆయన సాయంత్రం ఓ మీడియా కాన్క్లేవ్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఆయన అధిష్ఠానం పెద్దలను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్టు సమాచారం. తరుచూ ఢిల్లీకి వెళ్తుండడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని నియమించనున్నట్టు తెలిసింది. ఆయన గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువాకప్పి సత్కరించారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అవకాశమివ్వాలని విజ్ఞప్తిచేయగా సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం సాగుతున్నది.జానారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తే ఒకే ఇంటికి మూడు పదవులు ఎలా ఇస్తారనే విమర్శలు వస్తున్నాయి.