హైదరాబాద్, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధు లు, అధికారులు నేడు (శనివారం) తనిఖీలు నిర్వహించనున్నారు.
అకడే విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. పరిగి, చేవేళ్ల గురుకులాలను సీఎం రేవంత్‌రెడ్డి, ఖమ్మం జిల్లా మధిరలోని బీసీ బాలికల పాఠశాల, బోనకల్ గురుకులాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, భూపాల్లిపల్లి, మైలారం, గణపురం గురుకులాలను మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, ఖమ్మం జిల్లా మాదిరిపురం,
తిరుమలాయపాలెం గురుకులాలను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, షేక్‌పేట గురుకులాన్ని పొన్నం ప్రభాకర్, హత్నూర, సంగారెడ్డి గురుకులాలను కొండా సురేఖ, నేరడిగొండ, ఆదిలాబాద్ గురుకులాలను సీతక, భద్రాద్రి కొత్తగూడెంలోని గండుపల్లి, దమ్మపేట గురుకులాలను తుమ్మల నాగేశ్వరరావు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ గురుకులాలను జూపల్లి కృష్ణారావు తనిఖీ చేయనున్నట్టు ప్ర భుత్వ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభు త్వం ముందుగానే సమాచారమిచ్చి తనిఖీలకు పూనుకునే తీరును ఎండగడుతున్నారు.