హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పోలీసుల పిల్లలకు ఆరో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు సైనిక్సూల్ తరహాలో పోలీస్ రెసిడెన్షియల్ సూల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బుధవారం తెల ంగాణ పోలీసు అకాడమీలో ట్రైనీ ఎస్సైల దీక్షాంత్ పరేడ్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో 50 ఎకరా ల విస్తీర్ణంలో పోలీసు రెసిడెన్షియల్ సూల్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని ప్రకటించారు.
వ్యసనాలకు బానిసలైన కొంతమంది డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, శిక్షణ పొందిన ఎస్సైలు విధుల్లో చేరిన తర్వాత వాటిపై ఉకుపాదం మోపాల ని పిలుపునిచ్చారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఎస్సైలందరినీ చూ స్తుంటే, తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతున్నదని చెప్పారు. పోలీసుది ఒక ఉద్యోగం మాత్రమే కాదని అదొక భావోద్వేగమని చెప్పారు. ఏ సమస్య వచ్చినా ముందు గా అందుబాటులో ఉండేది పోలీసులేనని, వారి సాయంతో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ఆక్రమణలపై ఉకుపాదం మోపుతామని పేర్కొన్నారు. డ్రగ్స్ పేరు వింటేనే మోకాళ్లలో వణుకు పుట్టాలని అన్నా రు. పోలీస్‌స్టేషన్‌కు కన్నీళ్లతో వచ్చిన వారితోనే ఫ్రెండ్లీగా ఉండాలని నేరస్తులతో కాదని చెప్పా రు. ‘ప్రస్తుతం కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం’ అని స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా పోలీసు విభాగం తరపున ఒకరోజు వేతనం నుంచి రూ.11,06,83,571 నిధులను ముఖ్యమంత్రి సహాయనిధికి డీజీపీ జితేందర్, డీజీ శివధర్‌రెడ్డి, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా పోలీసుల సహాయక చర్యను సీఎం అభినందించారు. పరేడ్ అనంతరం పోలీసు అకాడమీలో నిర్మించిన క్రీడాభవన్ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అందులోని బ్యాడ్మింటెన్ కోర్టులో కాసేపు బ్యాడ్మింటెన్ ఆడారు. అంతకుముందు ట్రైనీ ఎస్సైల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, డీజీపీ జితేందర్, ఆర్బీఆర్ఆర్ పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ట్రై కమిషనరేట్ల సీపీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో ట్రైనీ ఎస్సైల బంధువులు పాల్గొన్నారు.
2022 ఏప్రిల్‌లో 17,516 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వాటిలో 16,929 కానిస్టేబుల్, తత్సమాన పోస్టులు, 587 ఎస్సై, తత్సమాన పోస్టులు ఉన్నాయి. ఎస్సై పోస్టులకు ప్రిలిమినరీ టెస్టు, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి నిరుడు ఆగస్టులోనే తుది ఫలితాలు ప్రకటించారు. అనంతరం గత ఏడాది సెప్టెంబర్‌లో శిక్షణను ప్రారంభించగా, 547 మంది ప్రస్తుతం శిక్షణ ముగించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు 33/3 శాతం రిజర్వేషన్‌ను పోలీసు ఉద్యోగాల్లో కూడా అమలుచేయడంతో వివిధ విభాగాలకు చెందిన మహిళా ట్రైనీ ఎస్సైలు 147 మంది ఎంపికయ్యారు.