Harish Rao | పోక్సో, ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ అరెస్ట్ కాకుండా కాపాడింది సీఎం రేవంత్ సన్నిహితుడేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ చైర్మన్. కేవలం రూ.20 లక్షలు లంచం తీసుకొని కాంగ్రెస్ సర్కార్ ఒక రేపిస్టును కాపాడిందని హరీశ్ రావు ఆరోపించారు. నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆ రేప్ చేసినోడితో కూర్చొని పోలీసులు మందు తాగారు. వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇస్తే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నడు. రూ.20 లక్షలు ఖర్చు పెట్టుకున్నడు. వచ్చి ఆరుగురిని ఊచకోత కోసిండన్నారు.
ఈ సైకో వ్యవహారంపై పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించి మాట్లాడుతున్నారు. కానీ, మన ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు హరీశ్ రావు. పైగా కరువు పరిస్థితులపై విలేకర్లు ప్రశ్నిస్తే మీ పీకలు కోసి రక్తం చల్లితే వానలు పడతాయి అని మాట్లాడుతున్నాడు. ఈ సైకో రాజ్ కుమార్కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా..? అని అడిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏపీలో తెలిసిన వ్యక్తి పేపర్ బాయ్.. పేపర్లు వేస్తుండే.. గోడల మీద రాతలు రాస్తుండే అన్నడట. ఆయన ఉన్నదే అన్నడు.. ఈయన గోడల మీద రాతలు రాసేటోడు. పెయింటర్.. అరే నేను ముఖ్యమంత్రిని నన్ను పెయింటర్ అంటవా అని రేవంత్ వాడిని పోలీసులు పట్టుకువచ్చి లోపలేశారన్నారు.
మా గీతమ్మ కూడా ఏదో పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు. నల్లబాలు అని పటాన్చెరులో ఉంటడు.. రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకునిపోయి పాపం జైలులో పెట్టారన్నారు హరీశ్ రావు. మరి రేప్ చేసినోడితో మాత్రం పోలీసోళ్లు కూర్చొని మందు తాగుతున్నారు. ఇది రేవంత్ పాలన. మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు.
రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకొని పోక్సో, ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ అరెస్ట్ కాకుండా కాపాడాడు
పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇస్తే, నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని ఆరుగురిని హత్య చేశాడు
ఏపీలో వైసీపీ స్పోక్స్… https://t.co/NCAnFRP5uD pic.twitter.com/ZVM3WcUfbw
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2026