Errolla Srinivas | సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా.. బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. అందుకేనేమో సిద్దిపేట వచ్చే ముందు భయంతో రైతు భరోసా ప్రకటించారని.. రేపు జరగబోయే జగిత్యాల సభ ముందు రెండో విడత రైతు భరోసా ప్రకటించారని తెలిపారు.
ఇది రైతు భరోసా ప్రభుత్వం కాదని.. తెలంగాణ ప్రజలకు ఏ భరోసా, ఏ నమ్మకాన్ని ఇవ్వని ప్రభుత్వమని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదని.. రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత లేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ అంటే భయం.. కేసీఆర్ సభలు పెడితే వెన్నులో వణుకు ఉందన్నారు. ఇది బాధ్యతతో నడుపుతున్న ప్రభుత్వం కాదని.. బీఆర్ఎస్ పార్టీపై భయంతో నడుస్తున్న ప్రభుత్వమని విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని స్పష్టంచేశారు.